Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 12 June 2024

ఇంటర్ అర్హతతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!, అప్లికేషన్ లింక్ ఇక్కడే!

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), అస్సాం రైఫిల్స్ విభాగాల్లోని వివిధ ఉద్యోగాల భర్తీకి సంస్థ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

దేశ సేవ చేస్తూ మంచి జీతం అందుకోవాలనే లక్ష్యం ఉన్నవారికి గుడ్‌న్యూస్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), అస్సాం రైఫిల్స్ విభాగాల్లోని వివిధ ఉద్యోగాల భర్తీకి సంస్థ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1526 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం అయింది. అర్హత ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫారమ్‌ సబ్‌మిట్ చేయడానికి జులై 8 వరకు గడువు ఉంది.

అధికారిక నోటిఫికేషన్ ప్రాకారం.. CAPFలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్/కంబాటెంట్ స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్/కంబాటెంట్ మినిస్టీరియల్); అస్సాం రైఫిల్స్‌లో వారెంట్ ఆఫీసర్ (పర్సనల్ అసిస్టెంట్), హవల్దార్ (క్లర్క్) పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. మొత్తం 243 ASI (స్టెనోగ్రాఫర్), వారెంట్ ఆఫీసర్ (పర్సనల్ అసిస్టెంట్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్), హవిల్దార్ (క్లార్క్) జాబ్ రోల్స్‌లో 1283 వేకెన్సీస్ ఉన్నాయి.

అర్హతలు

దరఖాస్తుదారులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. అభ్యర్థుల వయసు 2024 ఆగస్టు 1 నాటికి తప్పనిసరిగా 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే రిజర్వ్‌డ్ కేటగిరీ వారికి వయోపరిమితి సడలింపు ఉంటుంది. SC/ST కేటగిరీకి 5 సంవత్సరాలు, OBCలకు 3 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు ఎడిషనల్ ఏజ్ లిమిట్ ఉంటుంది.

అప్లికేషన్ ప్రాసెస్

- ముందు అధికారిక వెబ్‌సైట్‌ rectt.bsf.gov.in ఓపెన్ చేయండి.

- హోమ్‌పేజీలో ‘అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్/కంబాట్ స్టెనోగ్రాఫర్) & హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్/కంబాట్ మినిస్టీరియల్) ఇన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) అండ్ వారంట్ ఆఫీసర్ (పర్సనల్ అసిస్టెంట్) & హవల్దార్ (క్లర్క్) ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్-2024.’ లేబుల్ కనిపిస్తుంది. దాని పక్కన ‘అప్లై హియర్’ అనే ట్యాబ్ క్లిక్ చేయండి.

- కొత్త అప్లికేషన్ విండోలో అవసరమైన వివరాలను ఎంటర్ చేసి, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.

- తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి.

- భవిష్యత్తు అవసరాల కోసం ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింటవుట్ తీసుకోండి.

అప్లికేషన్ ఫీజు

అభ్యర్థులు రూ. 100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అయితే మహిళలు, రిజర్వ్‌డ్ కేటగిరీ వారు, మాజీ సైనికులకు ఫీజు లేదు. అయితే అభ్యర్థులందరూ సర్వీస్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది

సెలక్షన్ ఎలా?

రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో ముందు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహిస్తారు. ఇది ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్లియర్ చేసిన వారికి స్కిల్ టెస్ట్ చేసి, ఎంపిక చేస్తారు.

జీతం ఎంత?

ASI (స్టెనోగ్రాఫర్), వారెంట్ ఆఫీసర్ (పర్సనల్ అసిస్టెంట్) పోస్టులకు పే స్కేల్ రూ. 29,200 నుంచి రూ. 92,300 వరకు ఉంటుంది. హెడ్ ​​కానిస్టేబుల్ (మినిస్టీరియల్), హవల్దార్ (క్లర్క్) ఉద్యోగుల జీతం రూ.25,500 నుంచి రూ. 81,100 వరకు ఉంటుంది.

ముఖ్యమైన లింక్స్ 

ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 



2 comments:

Job Alerts and Study Materials