దేశ సముద్ర సరిహద్దులను కాపాడే ఇండియన్ కోస్ట్ గార్డ్..సెయిలర్, మెకానిక్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పాస్ అయినవాళ్లు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్‌సైట్ joinindiancoastguard.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తులను జూలై 3వ తేదీలోగా సమర్పించాలి. ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సనల్ టెస్ట్ (CGPT) 01/2025 బ్యాచ్ ద్వారా జరుగుతుంది.
పోస్టుల వివరాలు
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో మొత్తం 269 సెయిలర్ (జనరల్ డ్యూటీ), మెకానికల్ పోస్టుల భర్తీ కోసం రిక్రూట్ మెంట్ జరుగుతోంది. పురుషులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి
వయస్సు 18 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా 1 మార్చి 2003 నుండి 28 ఫిబ్రవరి 2007 మధ్య జన్మించి ఉండాలి.
విద్యార్హత
సెయిలర్ (జనరల్ డ్యూటీ) - ఈ పోస్ట్ కోసం అభ్యర్థులు 12th పాస్ (మ్యాథ్స్, ఫిజిక్స్) అయి ఉండాలి.
మెకానికల్- ఈ పోస్టుల కోసం ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్ (రేడియో/పవర్) ఇంజినీరింగ్‌లో 10వ తరగతి, మూడు లేదా నాలుగు సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు రుసుము
అభ్యర్థులందరూ (SC/ST మినహా) – రూ 300 చెల్లించాలి
SC/ST- అప్లికేషన్ ఉచితం
ఎంపిక ప్రక్రియ
అఖిల భారత స్థాయి పరీక్షలో నాలుగు దశలు ఉంటాయి - I, II, III, IV. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్-1లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. దీని తర్వాత స్టేజ్-IIలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌తో పాటు అసెస్‌మెంట్, అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది. స్టేజ్-IIIలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్టేజ్ IVలో మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది.
No comments:
Post a Comment