Mother Tongue

Read it Mother Tongue

Sunday, 16 June 2024

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలకు మరో జాబ్ నోటిఫికేషన్

 అంబేద్కర్ గురుకులాల్లో పార్ట్ టైమ్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న DSC అభ్యర్థులకు ఇటీవల ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం తీపి కబురును అందించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే DSC పై తొలి సంతకం చేస్తాను అని తెలిపినట్లుగానే ఇచ్చిన హామీ మేరకు మెగా DSC పేరుతో దాదాపు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గత ప్రభుత్వ హయాంలో DSC అప్లై చేసుకున్న 4,27,487 మందితో పాటు కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వారికీ అవకాశం దక్కింది.

ఇది ఇలా ఉంటే రాష్ట్రంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో పార్ట్ టైం గెస్ట్ టీచర్ ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డా॥ బి. ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమం లో పార్ట్ టైం (తాత్కాలికం) టీచర్ గా విభిన్న స్థాయిలలో (JL/PGT/TGT) పనిచేయుట కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ జిల్లా DCO కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.

JL-07 (Telugu-1, Maths-1, Physics-2, Chemistry- 2, Civics-1), PGT-02 (Maths-1, Social-1), TGT-05(Hindi-1, Telugu-1, Phy Science- 1,Bio Science-2) PD/PET- 04. పోస్టులు ఉండగా అందులో బాలికల పాఠశాలలో స్త్రీలకు మాత్రమే అవకాశం కల్పించింది. అదే విధంగా బాలుర పాఠశాలలో పురుషులకు మాత్రమే అర్హతలు ఉంటాయి.దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు తప్పనిసరిగా PG. B.Ed నందు కనీసం ద్వితీయ శ్రేణి ఉత్తీర్ణత మరియు TET నందు అర్హత కలిగి ఉండాలని తెలిపారు.

PD/PET లకు తప్పనిసరిగా PG, B.PEd నందు కనీసం ద్వితీయ శ్రేణి ఉతిర్ణత కలిగి ఉండాలని తెలిపింది.అభ్యర్థులు తమ దరఖాస్తులను జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయము నందు 18.06.2024 లోగా కార్యాలయం పని వేళలలో సమర్పించవలెనని తెలిపారు.

దరఖాస్తులు సమర్పించిన, అర్హులైన వారికీ 20-06-2024 (గురువారం) ఉదయం 9 గంటల నుండి Dr BR Ambedkar Gurukulam దిన్నెదేవరపాడు నందు డెమో ఉంటుందని జిల్లా సమన్వయకర్త డా.ఐ. శ్రీదేవి, తెలిపారు. మరింత సమాచారం కోసం సెల్ : 08518-295601 సంప్రందించవచ్చున్నారు.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials