బెంగాల్, డార్జిలింగ్‌లో రైలు ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్, డార్జిలింగ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ గూడ్స్ రైలు.. కాంచనగంగ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ని ఢీకొట్టింది.
నిజంగా ఇదో షాకింగ్ ఘటన. ప్రమాదం చాలా పెద్దగా జరిగింది. బోగీలు గాల్లోకి లేచాయి. సోమవారం ఉదయం డార్జిలింగ్ లోని ఫన్సీదేవా ఏరియాలో గూడ్స్ రైలు.. బలంగా ఎక్స్‌ప్రెస్‌ని ఢీకొట్టింది.
ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్‌లో స్పందించారు. “ఇప్పుడే, డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సిదేవా ప్రాంతంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాను. వివరాలు తెలియాల్సి ఉండగా, కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టినట్లు సమాచారం. DM, SP, వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు రెస్క్యూ, రికవరీ, వైద్య సహాయం కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభమయ్యాయి.” అని ఆమె తెలిపారు.
తాజా సమాచారం ప్రకారం.. ఆగి ఉన్న కాంచనగంగ ఎక్స్‌ప్రెస్‌ని గూడ్స్ రైలు వెనుక నుంచి వచ్చి, బలంగా ఢీకొట్టింది. దాంతో మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 10 నుంచి 15 మంది చనిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే.. డజన్ల మంది గాయపడి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ కారణంగా దగ్గర్లోని అన్ని ఆస్పత్రుల్లోనూ అలర్ట్ ప్రకటించారు. గాయపడిన వారిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పట్టాలపై ఉన్న బోగీలను తొలగిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా.. కొన్ని రైళ్లను దారి మళ్లించారు.
No comments:
Post a Comment