Mother Tongue

Read it Mother Tongue

Monday, 24 June 2024

నిరుద్యోగులకు బంపరాఫర్: 17,727 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అప్లికేషన్ లింక్ ఇక్కడే!

 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్. కేంద్ర మంత్రిత్వ శాఖలల, వివిధ కేంద్ర సంస్థల్లో గ్రూప్-B, గ్రూప్-C విభాగాల్లోని ఖాళీల భర్తీ కోసం నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024 (SSC CGL 2024) నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా దాదాపు 17,727 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO), సబ్ ఇన్‌స్పెక్టర్ నార్కోటిస్ట్, అప్పర్ డివిజన్ క్లర్క్, టాక్స్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (CGST మరియు సెంట్రల్ ఎక్సైజ్), ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI) వంటి పోస్టులు ఉన్నాయి.

ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 24 నుంచి జులై 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్‌/ అక్టోబర్‌లో రాత పరీక్షలు ఉంటాయి.  అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేసే ముందు పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ,విద్యార్హత తదితర వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది.

పోస్టుల వివరాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 17,727

-సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)

-సబ్ ఇన్‌స్పెక్టర్ (NIA)

-ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)

-పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)

-ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)

-ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్

-అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్

- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

-అసిస్టెంట్

- ఇన్‌స్పెక్టర్ (సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్)

- ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)

-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)

- అసిస్టెంట్/అసిస్టెంట్ సూపరింటెండెంట్

-ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (CBIC)

-డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)

- రిసెర్చ్ అసిస్టెంట్ (NHRC)

- సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (NCB)

-జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)

ముఖ్యమైన లింక్స్ 

రిజిస్ట్రేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

లాగిన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 



No comments:

Post a Comment

Job Alerts and Study Materials