Mother Tongue

Read it Mother Tongue

Thursday, 13 June 2024

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రముఖ బ్యాంకులో 627 ఖాళీలు..

 ప్రముఖ బ్యాంకు వివిధ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కలిసి మొత్తం 627 ఖాళీలు ఉన్నాయి.

ప్రముఖ బ్యాంకులు వరుసగా జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవల ఐబీపీఎస్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ స్థాయిలో ఉద్యోగాలకు నియామక ప్రక్రియ ప్రారంభించగా, తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కలిసి మొత్తం 627 ఖాళీలు ఉన్నాయి. జూన్ 12న అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా, అర్హత ఉన్నవారు జులై 2 వరకు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in లో ఆన్‌లైన్‌లో మోడ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో 459 సీట్లను కాంట్రాక్టు పద్ధతిలో, 168 రెగ్యులర్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పీరియడ్ ఒక సంవత్సరం. రెగ్యులర్ జాబ్స్ స్పెషలిస్ట్ కేటగిరీ కిందకు వస్తాయి. కార్పొరేట్ & ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ & ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు ఉన్నాయి. రెగ్యుల్ పోస్టుల్లో ఫారెక్స్ అక్విజిషన్ & రిలేషన్‌షిప్ మేనేజర్- 15, క్రెడిట్ అనలిస్ట్- 80, రిలేషన్‌షిప్ మేనేజర్- 66, సీనియర్ మేనేజర్-బిజినెస్ ఫైనాన్స్- 4, చీఫ్ మేనేజర్-ఇంటర్నల్ కంట్రోల్స్- 3 వేకెన్సీస్ ఉన్నాయి.

అప్లికేషన్ ప్రాసెస్

- అధికారిక వెబ్‌సైట్‌ bankofbaroda.in ఓపెన్ చేయండి.

- హోమ్‌పేజీలో కనిపించే అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి

- మీ కంప్యూటర్ స్క్రీన్‌పై కొత్త పేజీ కనిపిస్తుంది. ఇక్కడ అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్‌ నింపాలి.

- తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి.

- భవిష్యత్తు అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.

అప్లికేషన్ ఫీజు

బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ కోసం అప్లై చేసే జనరల్, OBC, EWS అభ్యర్థులు రూ. 600 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC, ST, PWD, మహిళా అభ్యర్థులకు రూ.100 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

సెలక్షన్ ఎలా?

బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ 2024 అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారం.. సెలక్షన్ ప్రాసెస్‌లో ముందు ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూలో స్కోర్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.

అర్హతలు, అనుభవం

- ఫారెక్స్ అక్విజిషన్, రిలేషన్‌షిప్ మేనేజర్

ఈ పోస్టులకు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. సేల్స్ లేదా మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా క్వాలిఫై అయి ఉండాలి. అలాగే ఫారెక్స్‌లో సేల్స్/ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్‌లో కనీసం 1 సంవత్సరం ఎక్స్‌పోజర్‌తో పాటు పబ్లిక్/ప్రైవేట్ / విదేశీ బ్యాంకులలో 2 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ అవసరం.

- క్రెడిట్ అనలిస్ట్

ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు గ్రాడ్యుయేషన్, CA క్వాలిఫై అవ్వాలి. క్రెడిట్ అప్రైజల్/ ప్రాసెసింగ్/ ఆపరేషన్స్‌లో ఎక్స్‌పోజర్‌తో పాటు పబ్లిక్/ ప్రైవేట్ / ఫారిన్ బ్యాంక్‌లలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

- చీఫ్ మేనేజర్ ఇంటర్నల్ కంట్రోల్స్

అభ్యర్థికి గ్రాడ్యుయేషన్, చార్టర్డ్ అకౌంటెంట్ అర్హత ఉండాలి. DISA/CISA సర్టిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆడిట్ కంపెనీలో ఇంటర్నల్ ఆడిట్ & ఇంటర్నల్ కంట్రోల్ విభాగంలో కనీసం 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు అర్హత, అనుభవం, జీతం, ఇతర కోసం అధికారిక నోటిఫికేషన్ చెక్ చేయవచ్చు.

అప్లై ఆన్లైన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 



No comments:

Post a Comment

Job Alerts and Study Materials