హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆధ్వర్యంలో పనిచేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లో సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆధ్వర్యంలో పనిచేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లో సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ కింద, మొత్తం 114 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు NIA అధికారిక వెబ్‌సైట్ nia.gov.in ద్వారా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లయ్ చేసే ముందు పోస్టుల వివరాలు, విద్యార్హతలు,వయోపరిమితి, ఎంపిక ప్రకియ సహా తదితర వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటికి సంబందించిన సమాచారం ఇక్కడ చూడండి.
పోస్టుల వివరాలు
ఇన్‌స్పెక్టర్ పోస్టుల సంఖ్య - 50
సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల సంఖ్య- 64
మొత్తం పోస్టుల సంఖ్య: 114
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)లో ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ కావాలనుకునే ఎవరైనా అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి.
వయోపరిమితి
NIA యొక్క ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులందరూ, వారి వయోపరిమితి చివరి తేదీ వరకు 56 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అప్పుడే వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి మెరిట్, వారి డాక్యుమెంట్స్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.
నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్‌ను ఇక్కడ చూడండి
NIA Recruitment 2024 నోటిఫికేషన్
NIA Recruitment 2024 అప్లయ్ చేయడానికి లింక్
ఎలా దరఖాస్తు చేయాలి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను సంబంధిత పత్రాలతో పాటు SP (అడ్మినిస్ట్రేషన్), NIA హెడ్‌క్వార్టర్స్, CGO కాంప్లెక్స్, లోధి రోడ్, న్యూఢిల్లీ-110003కు పంపాలి.
No comments:
Post a Comment