సివిల్ సర్వీస్ ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ కోసం జూన్ 30 లోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి డి.జనార్థన్ అన్నారు.
సివిల్ సర్వీస్ ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ కోసం జూన్ 30 లోగా దరఖాస్తులు
సమర్పించాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి డి.జనార్థన్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే
సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిలిమ్స్ మెయిన్స్, ఇంటర్వ్యూ ఎస్టీ, ఎస్సీ,
బీసీ అభ్యర్థులకు హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్
ద్వారా రెసిడెన్షియల్ పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ అందించేందుకు
జిల్లాల్లోని ఎస్టీ, ఎస్సీ, బి.సి. అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు
కోరుతున్నామని అన్నారు.
అభ్యర్థులకు ఆబ్జెక్టివ్ టైప్ ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయడం
జరుగుతుందని, దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం మూడు
లక్షలకు మించరాదని, అభ్యర్థులు జూన్ 30 వరకు http://studycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆన్ లైన్ దరఖాస్తు, సూచనలు http://studycircle.cgg.gov.in, http://twd.telangana.gov.in
వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 6281766534
నందు అన్ని పని దినాలలో ఉదయం 10-30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు
సంప్రదించాలని డి.జనార్థన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment