Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 26 June 2024

గ్రామీణ బ్యాంకుల్లో 10వేల క్లర్క్,PO పోస్టులు..వెంటనే అప్లయ్ చేసుకోండి

 క్లర్క్ పోస్టుకు వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ బ్యాంకింగ్ సెలక్షన్ (IBPS)దేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో దాదాపు 10వేల క్లర్క్, PO పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అవగా…దరఖాస్తు చేయడానికి రేపే(జూన్ 27) చివరి తేదీ. IBPS వెబ్‌సైట్ ibps.in ద్వారా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలి. నోటిఫికేషన్ ప్రకారం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ 5585 పోస్టులు, ఆఫీసర్ స్కేల్-1 పోస్టులు 3499 ఖాళీలు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఆగస్టు 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. లేటెస్ట్ అప్ డేట్ ల కోసం వెబ్‌సైట్‌ని చెక్ చేస్తూ ఉండండి.

దరఖాస్తు రుసుము

దరఖాస్తు రుసుము రూ. 850. అయితే SC/ST,శారీరక వికలాంగ అభ్యర్థులు కేవలం 175 రూపాయలు మాత్రమే చెల్లించాలి. దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ జూన్ 27.

అర్హత

ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్, ఆఫీసర్ (PO) పోస్టులకు అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ఆఫీసర్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ సంబంధిత సబ్జెక్టులో ఉండాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చూడండి.

వయోపరిమితి

క్లర్క్ పోస్టుకు వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ఆఫీసర్ కేటగిరీ పోస్టులకు ఇది భిన్నంగా ఉంటుంది.

ఎన్ని బ్యాంకుల్లో క్లర్క్‌లు, పీఓల నియామకం ఉంటుంది?

దేశంలోని 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది. వీటిలో కొన్ని ప్రధాన బ్యాంకుల పేర్లు కింద చూడండి

పంజాబ్ నేషనల్ బ్యాంక్

బ్యాంక్ ఆఫ్ బరోడా

కెనరా బ్యాంక్

ఇండియన్ బ్యాంక్

బ్యాంక్ ఆఫ్ ఇండియా

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్

UCO బ్యాంక్

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

ముఖ్యమైన లింక్స్ 

ఆఫీస్ అసిస్టెంట్ 

ఆఫీసర్ స్కేల్ I, II, III 

నోటిఫికేషన్ 



5 comments:

Job Alerts and Study Materials