Mother Tongue

Read it Mother Tongue

Saturday, 29 June 2024

రాత పరీక్ష లేకుండానే ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ. 70000 జీతం

 ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL)..కెమిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆయిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ oil-india.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ జూలై 11. ఈ పోస్టులకు అప్లయ్ చేసే ముందు అభ్యర్థులు కింద ఇచ్చిన పాయింట్లను జాగ్రత్తగా చదవాలి.

వయోపరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 24 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు ఉండాలి.

విద్యార్హత

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి కనీసం 02 (రెండు) సంవత్సరాల వ్యవధిలో కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, అభ్యర్థులు కనీసం ఒక  సంవత్సరం పారిశ్రామిక/సంస్థాగత/పరిశోధన ప్రయోగశాలలో పని అనుభవం కలిగి ఉండాలి.

జీతం

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ పోస్టులకు ఎంపికైన ఏ అభ్యర్థికైనా నెలకు రూ. 70,000 జీతం చెల్లించబడుతుంది.

నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్‌ని ఇక్కడ చూడండి

OIL India Recruitment 2024 నోటిఫికేషన్

OIL India Recruitment 2024అప్లయ్ చేయడానికి లింక్

ఎంపిక ప్రక్రియ

దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులందరూ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన చిరునామాలో ఇంటర్వ్యూకు హాజరు కావాలి

స్థలం: ఆయిల్ ఇండియా లిమిటెడ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ స్టడీస్, 5వ అంతస్తు, NRL సెంటర్, 122A క్రిస్టియన్ బస్తీ, G.S. రోడ్, గౌహతి, అస్సాం, ఇండియా, పిన్-781005



7 comments:

Job Alerts and Study Materials