తెలంగాణ లో మొదటి సారిగా గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి అత్యధికంగా పోస్టులను విడుదల చేశారు. ఉమ్మడి ఏపీలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒకేసారి 8వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయడం ఇదే తొలిసారి. తెలంగాణ లో మొదటి సారిగా గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి అత్యధికంగా పోస్టులను విడుదల చేశారు. ఉమ్మడి ఏపీలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒకేసారి 8వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయడం ఇదే తొలిసారి. అయితే ఇప్పటికే గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. గ్రూప్-4కు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 8180 గ్రూప్-4 పోస్టులకు దాదాపు 9 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అంటే దాదాపు పోస్టుకు వందమందికిపైనే పోటీ పడుతున్నారు. డిసెంబర్ 1, 2022న నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ డిసెంబర్ 31 నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. జనవరి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించిన కమిషన్ మరో నాలుగు రోజులు దరఖాస్తు గడువును పొడిగించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఇటీవల గ్రూప్ 4 పరీక్షను నిర్వహించే తేదీని టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. జూలై 1వ తేదీన గ్రూప్ 4 పరీక్షను నిర్వహించనుండగా.. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. కాగా ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను పరీక్ష జరిగే రోజు కంటే.. వారం రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కమిషన్ పేర్కొంది. టీఎస్పీఎస్సీ నుంచి విడుదలైన ప్రతీ పరీక్షకు వారం ముందు హాల్ టికెట్లను జారీ చేస్తారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ ను అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి డౌన్ లోడ్ చేసుకోవాలని కమిషన్ పేర్కొంది.
మొత్తం 8,180 ఉద్యోగాలు..
No comments:
Post a Comment