ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించన్నారు. ఇవి రేపటి నుంచి అంటే.. జూన్ 03వ తేదీ నుంచి జరగనున్నాయి. దీని కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 6,455 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 జిల్లాల్లో ఈ పరీక్ష సెంటర్లను కేటాయించారు. 11 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు జూన్ 10 వరకు జరగనున్నట్లు ఏపీపీఎస్సీ సెక్రటరీ ప్రదీప్కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ సారి బయోమెట్రికల్ తో పాటు.. తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని సెక్రటరీ ప్రకటించారు. దీని కోసం మొత్తం 70 బయో మెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేశామని పేర్కొన్నారు. ఈ పరీక్ష రాసే దివ్యాంగుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
త్వరలో మరో గ్రూప్ 1
ఏపీలో గ్రూప్-1, 2 ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ చైర్మన్ సైతం కీలక ప్రకటన చేశారు. సాధ్యమైనంత త్వరగా గ్రూప్ 1, 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో ఈ నోటిఫికేషన్లను విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తామని ప్రకటించారు.గతేడాది సెప్టెంబర్ లో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్ కు సంబంధించి రేపటి నుంచి నుంచి 10వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో 6,455 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో ఎంపిక చేశారు. కొత్త గ్రూప్-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్-2కు సంబంధించి మరో 900కిపైగా పోస్టులు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తం 1000కి పైగా ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల అవుతాయని సమాచారం.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment