మధ్యప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ రైల్వేల్లో ఖాళీలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. రైల్వేశాఖలో ఉద్యోగాల ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా 2.7లక్షల ఖాళీలు ఉన్నాయి. అందులో 1.7లక్షల వరకు కేవలం సేఫ్టీ కేటగీరి నుంచే ఉన్నాయి. ఈ విషయన్ని ఆర్టీఐ చెప్పింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ రైల్వేల్లో ఖాళీలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. రైల్వేశాఖలో గ్రూప్-సీ కేటగిరీ (లెవెల్-1 లేదా ఎంట్రీ లెవెల్ స్టాఫ్)లోనే 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది. వీటిలో ఒక్క భద్రతకు సంబంధించిన కేటగిరీలోనే 1,77,924 ఖాళీలు ఉన్నట్టు పేర్కొంది. ఈ ఏడాది జూన్ 1 నాటికి సేఫ్టీ కేటగిరీలో 9,82,037 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. 8,04,113 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు సమాధానంలో పేర్కొంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, త్వరితగతిన పదోన్నతులు కల్పించడం, శిక్షణ తర్వాత కోర్ ఉద్యోగాలకు నాన్-కోర్ సిబ్బందిని తరలించడం వంటి చర్యల ద్వారా సమస్యను పరిష్కరిస్తున్నట్టు రైల్వేశాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. రైలు ప్రమాద ఘటన తర్వాత రిక్రూట్మెంట్లు జరపాలన్న డిమాండ్ పెరిగింది. మరోవైపు గతేడాది పార్లమెంట్ లో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవి ఈ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేశారు. రైల్వేశాఖలో మొత్తంగా 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అయితే 2023 అక్టోబర్ వచ్చేసరికి 1.52 లక్షల పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అంటే మరి కొన్ని నెలల్లో రైల్వేకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.

No comments:
Post a Comment