
నిరుద్యోగులకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సర్వే ఇన్‌ఛార్జ్ (Survey in charge), సర్వేయర్ (Surveyor) పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 3444 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి జూలై 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఖాళీలు 3444
- సర్వే ఇన్‌ఛార్జ్ – 574 పోస్టులు
- సర్వేయర్ – 2870 పోస్టులు
దరఖాస్తు రుసుము
- సర్వే ఇన్‌ఛార్జ్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.944, సర్వేయర్ ఉద్యోగాలకు రూ.826 చెల్లించాల్సి ఉంటుంది.
విద్యార్హత
- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు ఆయా పోస్టుల ఆధారంగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయస్సు 18-40 ఏళ్లు ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment