పదో తరగతి అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పదిలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థలను ఎంపిక చేయనున్నారు. వీటి ఫలితాలను జూన్ మూడు లేదా 4వ వారంలో విడుదల కానున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇటు.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. అటు కేంద్రం నుంచి కూడా ఎన్నో రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. వీటిలో కొన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తుల ప్రక్రియ ముగియగా..మరికొన్నింటికి కొనసాగుతున్నాయి. తాజాగా పోస్టల్ డిపార్ట్ టెంట్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల 40వేలకు పైగా గ్రామీణ్ డక్ సేవక్ (జీడీఎస్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటికి ఇప్పటికే సెలెక్ట్ అయిన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. రెండు లేదా మూడు రోజుల్లో నాలుగో జాబితా కూడా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల 12 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషల్ జీడీఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746 బీపీఎం అండ్ 7,082 ఏబీపీఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ సందర్శించవచ్చు. మే 22 నుంచి వీటికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 11, 2023 తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. దరఖాస్తులో ఎడిట్ కు జూన్ 12 నుంచి జూన్ 14వ తేదీ వరకు ఈ అవకాశం కల్పించారు. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పదిలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థలను ఎంపిక చేయనున్నారు. వీటి ఫలితాలను జూన్ మూడు లేదా 4వ వారంలో విడుదల కానున్నట్లు తెలిపారు.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


No comments:
Post a Comment