ఇంజనీరింగ్, కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్‌కు అలర్ట్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (PFCL) వీరికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. భారీ జీతంతో ఈ సంస్థ జాబ్ ఆఫర్స్ అందిస్తోంది. ఈ మేరకు వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ చేపట్టింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభం కాగా, జూన్ 6 వరకు అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం ఉద్యోగాల సంఖ్య, అర్హత, అప్లికేషన్ ప్రాసెస్, ఇతర వివరాలు తెలుసుకుందాం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తాజా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్ సహా మొత్తం 29 పోస్టులు భర్తీ చేయనుంది. ఇందుకు విద్యార్హతలుగా చార్టెడ్ అకౌంటెంట్ (CA) లేదా సర్టిఫైడ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (CMA) లేదా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, పవర్, ఎనర్జీ విభాగాల్లో బీటెక్ ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు pfcindia.com వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు, జీతాల వివరాలు
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు రూ. 60,000 నుంచి రూ.119820 జీతం అందించనుంది. డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి రూ. 70వేల నుంచి రూ.1,39,790; మేనేజర్ పోస్టుకు రూ.80వేల నుంచి రూ.1,59,760; చీఫ్ మేనేజర్ ఉద్యోగానికి రూ.90వేల నుంచి రూ.1,79,730; డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు రూ.1లక్ష నుంచి రూ.2,60,000; జనరల్ మేనేజర్ పోస్టుకు రూ.1,20,000 నుంచి రూ.2,80వేల వరకు జీతం అందుకుంటారు.
విద్యార్హతలు
అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ (CFU) అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్‌తో పాటు CA/CMA క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి లేదా బిజినెస్ లేదా ఎకనామిక్స్ స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్‌తో పాటు రెండేళ్ల MBA, PGP, PGDBM లేదా PGDBA చదివి ఉండాలి. CA లేదా CMAలకు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ (ఫుల్ టైమ్ లేదా పార్ట్ టైమ్ లేదా డిస్టెన్స్) క్వాలిఫికేషన్ కూడా తప్పనిసరి. మేనేజ్‌మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫుల్ టైమ్ మోడ్‌లో చదవాలి, కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి. డిప్యూటీ మేనేజర్ అభ్యర్థులు ఫుల్ టైమ్ బీటెక్‌తో పాటు అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్థాయిలలో కనీసం 60% మార్కులతో కంప్యూటర్ సైన్స్/IT లేదా MCA (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్)/PGDCA (పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్) డిగ్రీ చదివి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేసేవారు.. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్, పవర్, ప్రొడక్షన్, ఎనర్జీ విభాగాల్లో బీటెక్ లేదా బీఈ చదివి ఉండాలి. అలాగే అభ్యర్థులు MBA (మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), PGP (పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్), PGDM (పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్), PGDBM (పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్) వంటి రెండేళ్ల కోర్సులు లేదా పవర్ BE/B.Techలో PGDBA (పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్) పూర్తిచేసి ఉండాలి.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment