ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT)-2 2023 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ afcat.cdac.inలో పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పణ గడువు జూన్ 30 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. AFCAT2 2023 పరీక్ష తేదీలు ఆగస్టు 25, 26, 27 తేదీల్లో షెడ్యూల్ చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా తమ AFCAT2 2023 అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇవి ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంటాయి. AFCAT అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి, ఇది afcat.cdac.in. అవసరమైన అన్ని వివరాలను అందించడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించండి. దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన సమాచారాన్ని పూరించండి. పేర్కొన్న విధంగా అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి, పరీక్ష రుసుము చెల్లించడానికి కొనసాగండి. మీరు అన్ని వివరాలను పూరించి, చెల్లింపు చేసిన తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి. సమర్పించిన తర్వాత, AFCAT 2 దరఖాస్తు ఫారమ్ కాపీని డౌన్‌లోడ్ చేయండి. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి, అభ్యర్థులు పరీక్ష రుసుము రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, NCC స్పెషల్ ఎంట్రీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పరీక్ష రుసుము చెల్లించకుండా మినహాయింపు ఉంటుంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లతో పాటు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. తొలి దశ ఏఎఫ్‌క్యాట్‌లో విజయం సాధించిన వారికి రెండో దశలో ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్‌ల ఆధ్వర్యంలో ఏఎఫ్‌ఎస్‌బీ టెస్టింగ్ నిర్వహిస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడంచెల్లో ఉంటుంది. ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్. సైకాలజికల్ టెస్ట్. ఇందులో భాగంగా అయిదు రోజులపాటు పలు అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు ప్రత్యేకంగా కంప్యూటరైజ్డ్ పైలట్ సెలెక్షన్ సిస్టమ్ (సీపీఎస్‌ఎస్) విధానంలో ఇంకో పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ 'సి' సర్టిఫికెట్ ద్వారా ఎన్‌సీసీ ఎంట్రీకి దరఖాస్తు చేసుకున్న వారికి ఏఎఫ్‌క్యాట్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఇలా.. ఏఎఫ్‌క్యాట్‌తోపాటు ఏఎఫ్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన∙వారిని శిక్షణకు ఎంపిక చేస్తారు. తుది విజేతలుగా నిలిచిన వారికి ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్)లో శిక్షణనిస్తారు. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ-టెక్నికల్ విభాగాలకు ఎంపికైన వారికి 74 వారాలు, గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్) బ్రాంచ్‌లకు 52 వారాల పాటు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి.. సంబంధిత విభాగాల్లో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా కొలువు ఖరారు అవుతుంది. వీరికి ప్రారంభంలో రూ.56,100 - రూ.1,77,500 వేతన శ్రేణి లభిస్తుంది. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టయిఫండ్ ఇస్తారు. ఇంగ్లిష్: కాంప్రషెన్షన్, ఇంగ్లిష్ గ్రామర్, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ ఫార్మేషన్, స్పాటింగ్ ద ఎర్రర్, యాంటానిమ్స్, సినానిమ్స్, క్లోజ్ టెస్ట్, ఇడియమ్స్, ఫ్రేజెస్, అనాలజీ, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్‌లపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. జనరల్ అవేర్‌నెస్: చరిత్ర, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీలతోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం సంతరించుకున్న అంశాలు, సంఘటనలు, సైన్స్ అండ్ టెక్నాలజీ తాజా పరిణామాలు, రక్షణ రంగంలోని పరిణామాలపై దృష్టి సారించాలి. న్యూమరికల్ ఎబిలిటీ: టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్, సింపుల్, కాంపౌండ్ ఇంట్రస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, నంబర్ సిరీస్, పెరిమీటర్, ఏరియా, ప్రాబబిలిటీ అంశాలపై అవగాహన పొందాలి. రీజనింగ్ అండ్ మిలటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్: ఇందులో రాణించడానికి వెర్బల్, నాన్ -వెర్బల్ రీజనింగ్ అంశాలతోపాటు.. సీటింగ్ అరేంజ్‌మెంట్, రొటేటెడ్ బ్లాక్స్, హిడెన్ ఫిగర్స్, అనాలజీపై అవగాహన పొందాలి.
ఉద్యోగ ఖాళీలు 276
-
-
-
ముఖ్యమైన తేదీలు
- మే 03, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- జూన్ 03, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
దరఖాస్తు రుసుము
-
-
-
విద్యార్హత
-
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 15 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు లోపు ఉండాలి
- రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment