కొత్తగా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇల్లులేని వారికి ప్రభుత్వం మహిళల పేరిట ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తోపాటు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గం కేంద్రాలలో మహిళా సదస్సు నిర్వహిస్తున్నారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మహిళా సంక్షేమ దినోత్సవం వేదికగా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ మహిళలకు ఏం చేశారు..? ఓ లుక్కేయండి..
ఆడపిల్ల పుడితే..:
ఆడపిల్ల పుడితే బాధ పడే రోజులు ఇంకా ఉన్నా.. గతంతో పొల్చితే ప్రజల్లో ఆ ఆలోచనా విధానం కాస్త తగ్గిందనే చెప్పాలి. ప్రభుత్వ పథకాలు కూడా ప్రజల్లో మార్పు తీసుకొస్తున్నాయి. ఆడపిల్ల పుడితే రూ.13వేలు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తూ.. నాణ్యమైన పరికరాలతో కూడిన కేసీఆర్ కిట్, చిన్నారులు, కిశోరబాలికలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి పాటుపడేలా అంగన్‌వాడీ కేంద్రాలను అందించి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో పేదల ఇంట్లో కల్యాణ కాంతులు వెలుగుతున్నాయి.
షీ టీమ్స్:
రాష్ట్రంలో మహిళలకు సంపూర్ణ రక్షణ అందించాలన్న ధ్యేయంతో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో ‘షీ టీమ్స్’ వ్యవస్థ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీని ద్వారా సమాజంలోని అల్లరి మూకల నుంచి స్త్రీలకు పూర్తి స్థాయి రక్షణను అందించగలుగుతున్నది. వివాహిత మహిళలకు కుటుంబంలోని సమస్యలను అధిగమించేందుకు కావలసిన ధైర్య స్థైర్యాలను ఇచ్చి, వారికి తాత్కాలిక ఆవాసం లాంటి సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం ‘సఖి’ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లలో అనేక సమస్యలకు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారం లభిస్తోంది.
త్వరలో గృహలక్ష్మి పథకం:
గూడులేని ప్రతి నిరుపేదకూ సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినది. ఇప్పటికే డబుల్ బెడ్‌రూం పథకాన్ని అమలు చేస్తుండగా, కొత్తగా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇల్లులేని వారికి ప్రభుత్వం మహిళల పేరిట ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నది. అయితే సొంత జాగ ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేని వారికి రూ.3 లక్షల చొప్పున ఆడబిడ్డల పేరిట ఆర్థిక సహాయాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించేందుకు నిర్ణయించింది.
విద్య కోసం:
ఆడ పిల్లలు విద్యారంగంలో ముందుకు రావాలి అనే సంకల్పంతో వారి కోసం ప్రత్యేకమైన గురుకులాలను ప్రభుత్వం స్థాపించింది. సాంఘిక సంక్షేమ గిరిజన శాఖ, వెనుకబడిన – మైనారిటి సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థినుల చదువుల కోసం బృహత్తరమైన కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నది.
ఉద్యోగాల్లో కూడా...:
మహిళలకు సివిల్ పోలీస్ ఉద్యోగ నియామకాల్లో 33శాతం, armed రిజర్వ్ పోలీసు నియామకాల్లో 10శాతం రిజర్వేషన్లు ఇస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అంగాన్వాడీ టీచర్లకు ప్రతినేల రూ.13,650, ఆశా కార్యకర్తలకు రూ.9,750రూపాయలు పారితోషికం అందిస్తోంది. అంతేకాదు మహిళలు పారిశ్రమికవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో అంకుర సంస్థలకు ప్రోత్సాహాన్ని కలిగించడం కోసం వీహబ్ ఏర్పాటు చేసింది. మహిళలు కూడా పారిశ్రామిక రంగంలో ప్రవేశించి, తోటి మహిళలకు ఉద్యోగ అవకాశాలను పెంచి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంలో తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment