తెలంగాణలో పోలీస్ నియామక ప్రక్రియ (Telangana Police Recruitment) చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు (TS SI, Constable Jobs) సంబంధించిన మెయిన్స్ పరీక్ష నిర్వహణ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా కీలక ప్రకటన చేసింది. తుది రాతపరీక్ష ఫలితాల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించిన డేట్స్ ను విడుదల చేశారు అధికారులు. ఈ నెల 14వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రంలోని మొత్తం 18 కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. తుది ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు టీఎస్ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్ (https://www.tslprb.in/) నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించిన లెటర్లను డౌన్ లోడ్ చేసుకోవాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించిన కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెంటర్లు:
- ఆదిలాబాద్: ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ గ్రౌండ్, ఎస్పీ ఆఫీస్
- సైబరాబాద్: సీటీసీ, సీపీ ఆఫీస్, గచ్చిబౌలి
- హైదరాబాద్: శివకుమార్ లాల్ పోలీసు స్టేడియం, గోషామహల్, హైదరాబాద్
- కరీంనగర్: పోలీసు హెడ్ క్వార్టర్స్, కరీంనగర్
- ఖమ్మం: సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్, ఖమ్మం
- కొత్తగూడెం: సీఈఆర్ క్లబ్, ప్రకాశ్ స్టేడియం, కొత్తగూడెం
- మహబూబాబాద్: డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీసు, సబ్ జైల్ దగ్గర, మహబూబాబాద్
- సంగారెడ్డి: పోలీసు పరేడ్ గ్రౌండ్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్, సంగారెడ్డి
- సిద్దిపేట: పోలీసు కమిషనరేట్, సిద్దిపేట
- సూర్యాపేట: డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీసు, సూర్యాపేట
- వరంగల్: సీపీ ఆఫీస్, వరంగల్
- నల్లగొండ: డార్మెటరీ హాల్, పోలీసు హెడ్ క్వార్టర్స్, నల్లగొండ
- నిజామాబాద్: పోలీసు పరేడ్ గ్రౌండ్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, నిజామాబాద్
- రాచకొండ: సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, అంబర్‌పేట్, హైదరాబాద్
- రామగుండం: సీపీ ఆఫీస్, రామగుండం
- మహబూబ్‌నగర్: డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్, మహబూబ్‌నగర్
- నాగర్‌కర్నూల్: డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్, నాగర్‌కర్నూల్
- గద్వాల్: డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీస్, జోగులాంబ గద్వాల
.jpg)
No comments:
Post a Comment