పేపర్ లీకేజీ కారణంగా ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో మొత్తం 503 ఉద్యోగాల గ్రూప్-1 ఖాళీల భర్తీకి ఈ నెల 11న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అక్టోబర్ 16న ప్రిలిమ్స్ నిర్వహించగా.. పేపర్ లీక్ కారణంగా రద్దు చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ నేపథ్యంలో ఈ సారి పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు. అభ్యర్థులకు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, బయోమెట్రిక్ ధ్రువీకరణ తరువాతే పరీక్ష సెంటర్లలోకి అనుమతించనున్నారు. ఇంకా.. పరీక్ష తేదీకి కేవలం వారం ముందుగానే ఎగ్జామ్ సెంటర్లను కేటాయించనున్నారు. ఇందుకోసం ‘ర్యాండమైజేషన్’ ప్రక్రియను అనుసరిస్తున్నారు. ఈ ప్రక్రియ మరో 2 రోజుల్లో ముగియనుందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం ఈ నెల 4వ తేదీలోగా హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించాయి. ఇంకా ఎగ్జామ్ సెంటర్లలో అభ్యర్థులెవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే అత్యంత కఠినంగా వ్యవహరించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ యోచిస్తోంది. సెంటర్లలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినా.. రూల్స్ పాటించకుండా ఏమైనా వస్తువులను తీసుకువచ్చినా వారిపై జీవితకాలం కమిషన్ నిర్వహించే ఏ పరీక్ష కూడా రాయకుండా నిషేధం విధిస్తామని హెచ్చిరిస్తోంది టీఎస్పీఎస్సీ.

No comments:
Post a Comment