Group 1 Key | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ అందించింది. తాజాగా టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 ఆన్సర్ కీ 2023ని విడుదల చేసింది. జూన్ 28న ఈ ఆన్సర్ కీ విడుదల అయ్యింది. గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో పాల్గొన్న వారు ఈ ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. అలాగే సులభంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్ ద్వారా మీరు ఈ గ్రూప్ 1 ఆన్సర్ కీ పొందొచ్చు. tspsc.gov.in వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు చాలా ఈజీగానే గ్రూప్ 1 ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2023 జూన్ 11న టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించింది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు ఈ పరీక్ష జరిగింది. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 ఆన్సర్ కీ పొందటానికి అభ్యర్థులు పైన ఇచ్చిన లింక్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో వెళ్లాలి. ప్రిలిమినరీ ఆన్సర్ కీ ప్రస్తుతం పీడీఎఫ్ రూపంలో ఉంది. దీనికి ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేదు. నేరుగా చెక్ చేసుకోవచ్చు. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 ఆన్సర్ కీ 2023 డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలానో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. అభ్యర్థులు ముందుగా tspsc.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ హోమ్ పేజ్‌లో మాస్టర్ క్వశన్ పేపర్ అండ్ ప్రిలిమినరీ కీస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు నచ్చిన సబ్జెక్ట్‌పై క్లిక్ చేయొచ్చు. ఇది మీ ఇష్టం. తర్వాత పీడీఎఫ్ ఆన్సన్ కీ మీకు కనిపిస్తుంది. తర్వాత దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత ప్రింట్ కావాలంటే తీసుకోవచ్చు. లేదంటే లేదు. ఇకపోతే 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ ఈ పరీక్ష నిర్వహించింది. ఇందులో వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి. 121 మండల్ పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, 91 డిప్యూటీ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్, 48 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, 42 డిప్యూటీ కలెక్టర్లు, 40 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లను నియమించనుంది. కాగా అభ్యర్థులకు తాజాగా విడుదల అయిన ఈ గ్రూప్ 1 ఆన్సర్ కీ పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 1 నుంచి జూలై 5 వరకు తెలియ జేయవచ్చని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. అందువల్ల మీరు ఈ గ్రూప్ 1 ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియ జేయవచ్చు. దీని వల్ల మీకు కూడా ఏమైనా బెనిఫిట్ ఉండొచ్చు.
ముఖ్యమైన లింక్స్
- గ్రూప్ 1 కీ కొరక ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment