
Jobs | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ అదిరే శుభవార్త అందించింది. ఉద్యోగాల అంశంపై కీలక ప్రకటన చేసింది. అలాగే ఇండియాలో భారీగా ఇన్వెస్ట్ చేస్తామని వెల్లడించింది. దీని వల్ల చాలా మందికి ఉపాధి లభిస్తుందని చెప్పుకోవచ్చు. భారత్‌లో మరో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామని అమెజాన్ ప్రకటించింది. దీంతో దేశంలో అమెజాన్ పెట్టుబడులు 26 బిలియన్ డాలర్లకు చేరుతాయని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం తర్వాత అమెజాన్ సీఈవో యాండీ జస్సీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు భారత్‌లో 11 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశామని, అలాగే భవిష్యత్‌లో మరో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామని ఆయన వెల్లడించారు. 2023 కల్లా మొత్తంగా 26 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని తెలిపారు. స్టార్టప్స్‌కు మద్దతు ఇస్తామని, ఉద్యోగాలు అందిస్తామని, ఎగుమతులు చేస్తామని, స్మాల్ బిజినెస్‌కలు మద్దతుగా ఉంటాయని ఆయన వివరించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను వెల్లడించారు. మోదీ అమెరికా పర్యాటనలో ఉండగా యాండీ ఆయనతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఇండియన్ స్టార్టప్స్, ఉపాధి కల్పన, ఎగుమతులను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ వంటి పలు అంశాలపై ఇరువురు మాట్లాడుకున్నారు. 2023 కల్లా 10 మిలియన్ స్మాల్ బిజినెస్‌లను డిజిటైజ్ చేయడం, 20 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 20 లక్షల ఉద్యోగులు లక్ష్యంగా అమెజాన్ ముందుకు వెళ్తుంది.
No comments:
Post a Comment