ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) ప్రిన్సిపాల్, PGT, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) అండ్ ల్యాబ్ అటెండెంట్ పోస్టుల కోసం అభ్యర్థులను రిక్రూట్ చేయబోతున్నాయి. పేర్కొన్న పోస్టులకు మొత్తం 4062 ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా EMRSలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలను భర్తీ చేయడానికి EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ESSE) -2023 ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పరీక్ష విధానం ఆన్‌లైన్‌లో ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ - 31 జులై 2023. https://emrs.tribal.gov.in/site/recruitment
విద్యార్హత
- ప్రిన్సిపాల్ - గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి మాస్టర్స్ డిగ్రీ అండ్ B.Ed.12 సంవత్సరాల అనుభవం.
- PGT - సంబంధిత సబ్జెక్టులలో విశ్వవిద్యాలయంగా పరిగణించబడే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఇంటిగ్రేటెడ్ 4 సంవత్సరాల డిగ్రీ కోర్సు విషయంలో, B. Ed. అవసరం లేదు).
- అకౌంటెంట్ - గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి కామర్స్ డిగ్రీ.
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) - గుర్తింపు పొందిన బోర్డు నుంచి సీనియర్ సెకండరీ (క్లాస్ XII) సర్టిఫికేట్ అండ్ ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషాలకు 35 పదాలు లేదా హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం కలిగి ఉండాలి.
- ల్యాబ్ అటెండెంట్ - ల్యాబొరేటరీ టెక్నిక్‌లో సర్టిఫికేట్/డిప్లొమాతో 10వ తరగతి ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుంచి సైన్స్ స్ట్రీమ్‌తో 12వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి
- ప్రిన్సిపాల్ - 50 సంవత్సరాలు
- PGT - 40 సంవత్సరాలు
- అకౌంటెంట్ - 30 సంవత్సరాలు
- JSA - 30 సంవత్సరాలు
- ల్యాబ్ అటెండెంట్ - 30 సంవత్సరాలు
జీతం
- ప్రిన్సిపాల్ - రూ. 78800-209200/-
- పీజీటీ - రూ. 47600-151100/-
- అకౌంటెంట్ - రూ. 35400-112400/-
- JSA - రూ. 19900-63200/-
- ల్యాబ్ అటెండెంట్ - రూ. 18000-56900/-

No comments:
Post a Comment