9,210 టీచర్ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా టీజీటీ, పీజీటీ పోస్టులకు కలిపి 1.6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పీజీటీ, టీజీటీ పోస్టుల్లోనూ కొన్ని సబ్జెక్టులకు 35 వేలలోపు వచ్చాయి. గురుకుల నియామక బోర్డు నుంచి మొత్తం 9 నోటిఫికేషన్లు విడుదల చేశారు. మొత్తం ఈ నోటిఫికేషన్ల ద్వారా 9,231 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఏప్రిల్ 17వ తేదీన రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. డిగ్రీ కాలేజీ లెక్చరర్ అండ్ జూనియర్ కాలేజీ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తులను స్వీకరించారు. వీటికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మే 17, 2023వ తేదీన ముగిసింది. మొత్తం జూనియర్ కాలేజీ లెక్చరర్ ఉద్యోగాలకు 50వేలకు పైగా దరఖాస్తులు రాగా.. డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ఉద్యోగాలకు 8వేలకు పైగా వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 24వే తేదీ నుంచి గురుకుల నుంచి విడుదలైన 5 నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. వీటిలో పీజీటీ, లైబ్రేరియన్(Librarian), పీఈటీ, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్ పోస్టులు ఉన్నాయి. వీటికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మే 24తో ముగిసింది. ఇక మ్యూజిక్ టీచర్ పోస్టులకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 27వ తేదీన విడుదల కాగా.. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయింది. వీటికి కూడా మే 24తో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. మొత్తం 6 నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల గడువు మే 24తో ముగిసింది. అయితే ఇక టీజీటీ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 27 తేదీన విడుదల కాగా.. మే 27వ తేదీన ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4006 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 9,210 టీచర్ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా టీజీటీ, పీజీటీ పోస్టులకు కలిపి 1.6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పీజీటీ, టీజీటీ పోస్టుల్లోనూ కొన్ని సబ్జెక్టులకు 35 వేలలోపు వచ్చాయి. అయితే.. ఈ పోస్టులకు సంబంధించి అర్హత పరీక్షలకు సంబంధించి నిర్వహణపై దృష్టి సారించింది టీఆర్ఈఐఆర్బీ. ఆగస్టు నెలలో పరీక్షలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన గురుకుల బోర్డు.. తేదీలపై ముమ్మర కసరత్తు చేస్తోంది. అయితే.. వీటికి దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. ప్రిపరేషన్ కు రెండు నెలల సమయం ఇవ్వాలని యోచిస్తోంది. మొత్తం 9 నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఇదే విధానాన్ని అనుసరించనున్నారు.

No comments:
Post a Comment