నిరుద్యోగులకు అలర్ట్. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద- న్యూఢిల్లీ (AIIA- New Delhi) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ మోడ్‌లో అప్లై చేసుకోవాలి. ఈ గడువు జూన్ 20తో ముగియనుంది. AIIA ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా నాన్ టీచింగ్ విభాగంలో ప్రధానంగా యోగా ఇన్‌స్ట్రక్టర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంటెంట్, రేడియోలజీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తంగా 31 ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఈ రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ వంటి వివరాలను పరిశీలిద్దాం.
ఉద్యోగ ఖాళీలు 33
- యోగా ఇన్‌స్ట్రక్టర్-3
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1
- అకౌంటెంట్-3
- అకౌంటెంట్-3
- ల్యాబ్ అసిస్టెంట్-11
- ల్యాబ్ అటెండెంట్-10
- లోయర్ డివిజన్ క్లర్క్ -2
ముఖ్యమైన తేదీలు
- మే 03, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- జూన్ 03, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
అర్హత ప్రమాణాలు
- యోగా ఇన్‌స్ట్రక్టర్: ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే యోగాలో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. అలాగే ఒక సంవత్సరం వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. అభ్యర్థి గరిష్ట వయసు 30 ఏళ్లలోపు ఉండాలి.
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: ఈ పోస్ట్‌కు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. మూడేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. అభ్యర్థి గరిష్ట వయసు 35 ఏళ్లలోపు ఉండాలి.
- అకౌంటెంట్: అభ్యర్థులు బీకాం లేదా బీబీఏ పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. గరిష్ట వయసు 30 ఏళ్లలోపు ఉండాలి.
- రేడియోలజీ అసిస్టెంట్: రేడియోగ్రఫిలో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. గరిష్ట వయసు 25 ఏళ్లలోపు ఉండాలి.
- ల్యాబ్ అసిస్టెంట్: ఎంఎల్‌టీలో డిప్లొమా పాసై ఉండాలి. రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. గరిష్ట వయసు 28 ఏళ్లలోపు ఉండాలి.
- ల్యాబ్ అటెండెంట్: ఇంటర్ లేదా, ఐటీఐ పాసై ఉండాలి. రెండు నుంచి నాలుగేళ్ల అనుభవం తప్పనిసరి. గరిష్ట వయసు 28 ఏళ్లలోపు ఉండాలి.
- లోయర్ డివిజన్ క్లర్క్: ఇంటర్ పాసై ఉండాలి. టైపింగ్ స్కిల్స్ తప్పనిసరి. గరిష్ట వయసు 28 ఏళ్లలోపు ఉండాలి.
అప్లికేషన్ ప్రాసెస్
- ముందు AIIA అధికారిక పోర్టల్ https://aiia.gov.in/ ను విజిట్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అన్ని వివరాలను సమర్పించి అప్లికేషన్‌ను ఫిలప్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లను జత చేయండి. ఆ తరువాత అప్లికేషన్‌ను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయూర్వేద(AIIA) గౌతంపురి, సరితా విహార్, మాతురా రోడ్, న్యూ ఢిల్లీ-110076 అనే అడ్రస్‌కు పంపాలి.
అప్లికేషన్ ఫీజు
- అప్లికేషన్ ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ
- అభ్యర్థుల ఎంపిక ప్రకియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష ఉంటుంది. ఆ తరువాత స్కిల్ టెస్ట్, చివరగా మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

No comments:
Post a Comment