ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరోసారి జాబ్ నోటిఫికేషన్ (AP Govt Job Notification) రిలీజ్ చేసింది. ఇవి రెగ్యులర్ ఉద్యోగాలు కాకపోయినా.. రెండున్నర లక్షల జీతంతో కాంట్రాక్ట్ జాబ్స్ భర్తీకి ప్రకటన ఇచ్చింది. వైద్య శాఖలో ఈ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 331 పోస్టులను జూలై 5, 7, 10 తేదీలలో ఎపివివిపి కమీషనర్ కార్యాలయము, గొల్లపూడి, విజయవాడలో వాక్ ఇన్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తామని తెలిపారు. ఈ ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం వుందనీ , సంబంధిత పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు నమూనాను cfw.ap.nic.in, hmfw.ap.gov.in వెబ్ సైట్లలో ఉంచామనీ పేర్కొన్నారు. ఈ నియామకాలలో కాంట్రాక్టు పద్ధతి నియామకాలకు స్థానికత, రోస్టర్ విధానం నుండి సడలింపు ఇవ్వబడుతుంది. రెగ్యులర్ ప్రాతిపదికన టైం స్కేల్ ఆఫ్ పే ఇతర అలవెన్సులు, గిరిజన ప్రాంతంలో 50 శాతం అదనపు జీతం ఇవ్వబడుతుంది. కాంట్రాక్టు విధానంలో గిరిజన ప్రాంతంలో రెండున్నర లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతంలో రెండు లక్షల రూపాయలు నెలవారీ జీతం ఇవ్వబడుతుంది. కావున అర్హులైన అభ్యర్థులందరూ వాక్ ఇన్ రిక్రూట్మెంట్ లో పాల్గొనవచ్చ అని ఆయన తెలిపారు. ఇతర వివరాల కోసం 06301138782 ఫోన్ నంబరుకు గానీ, pvvpwalkinrecruitment@gmail.com ఇమెయిల్ కు గానీ సంప్రదించాలని అధికారులు తెలిపారు.

No comments:
Post a Comment