టీఎస్పీఎస్సీ నుంచి ఇటీవల పలు నోటిఫికేషన్లు విడుదల కాగా.. వాటికి వరుస పరీక్షలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే గ్రూప్ 1 పరీక్ష జూన్ 11న విజయవంతంగా పూర్తి చేశారు. అయితే గ్రూప్ 4 పరీక్ష నిర్వహణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఇటీవల టీఎస్పీఎస్సీ నుంచి పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల కాగా.. వాటిలో చాలా వరకు పరీక్షలు నిర్వహించారు. మరికొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. దీనిలో భాగంగానే తాజాగా టీఎస్పీఎస్సీ రెండు నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల తేదీలను ప్రకటించింది. ఆగస్టు 08వ తేదీన అకౌంట్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. దీంతో పాటు.. జూనియర్ కాలేజీ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. వీటిని సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 03 వరకు ఉదయం, సాయంత్రం ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. వరుసగా వివిధ సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు 11 రోజులు జరగనున్నాయి. దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ రెండు వెబ్ నోట్స్ ఇటీవల విడుదల చేసింది. వీటికి అడ్మిట్ కార్డులను పరీక్ష జరిగే వారం ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా.. గ్రూప్ 1 పరీక్షను జూన్ 11వ తేదీన విజయవంతంగా పూర్తి చేసింది టీఎస్పీఎస్సీ. అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంటే ఈ సారి హాజరు శాతం చాలా వరకు తగ్గింది. మొత్తం మీద 61 శాతం మంది హాజరయ్యారు. అయితే దీనిపై నిరుద్యోగులు ఇటీవల పరీక్ష వాయిదా వేయాలని కోర్టును ఆశ్రయించినా నిరాశ ఎదురైంది. అయితే తాజాగా అభ్యర్థులు గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయాలని ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ పరీక్షల నిర్వహణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ పరీక్షలు ప్రకటించిన తేదీల్లోనే యథావిధిగా జరుగుతాయని పేర్కొంది. అంటే.. గ్రూప్ 4 పరీక్ష జులై 01న నిర్వహించడం అనివార్యం అయిపోయింది. దీంతో నిరుద్యోగులు నిరాశకు గురయ్యారు. పేపర్ లీకేజీ వ్యవహారంతో తాము గందరగోళానికి గురయ్యామని తెలిపినా.. హైకోర్టు వాయిదా వేసేందుకు నిరాకరించింది. గ్రూప్ 2, 3, 4 పరీక్షలకు మధ్య రెండు నెలల సమయం ఇవ్వాలని కోరుతూ ఆ పిటిషన్లో పేర్కొనగా హైకోర్టు నిరాకరించింది. ఇక ఇటీవల గ్రూప్ 4, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో మొదట టైపిస్ట్ పోస్టులను కేటాయిస్తూ జారీ చేసిన జీవో కు వ్యతిరేఖంగా మరో జీవోను ప్రభుత్వం తీసుకొచ్చింది. తర్వాత తీసుకొచ్చిన జీవోలో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులు తీసేసింది. ఇలా 55, 136 జీఓలను ప్రభుత్వం తీసుకురాగా.. వాటిని కొట్టివేయాలని 101 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం tspsc, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసును జులై 13కు వాయిదా వేసింది.

No comments:
Post a Comment