తమ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించడానికి ఇటీవల రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ ట్రస్టులు ఆధ్వర్యంలో భారీగా జాబ్ మేళాలను నిర్వహిస్తున్నాయి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో మరో భారీ జాబ్ మేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ జాబ్ మేళాను ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్నట్లు రఘునందన్ రావు వెల్లడించారు. దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలోని కోమటిరెడ్డి రజనికాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ జాబ్ మేళాలో బిగ్ బాస్కెట్, రెడ్డీస్ ల్యాబ్స్ లాంటి ప్రముఖ వందకు పైగా కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు పోస్టర్ పై ఇచ్చిన QR కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా కానీ.. 7893335975 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా జాబ్ మేళా నిర్వహించే రోజు సమయం ఆదా అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వనియోగం చేసుకోవాలని కోరారు.
విద్యార్హతలు
టెన్త్, ఇంటర్, యూజీ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీ.కామ్, డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏ, హోటల్ మేనేజ్మెంట్, పీజీ, ఐటీఐ, డ్రైవర్స్.
జాబ్ మేళా నిర్వహించు ప్రదేశం
కోమటిరెడ్డి రజనికాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్, దుబ్బాక.
సమయం
ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment