వీరిలో 30 నుంచి 40 శాతం మంది భారతీయులు ఉండొచ్చని అంచనా. వీరందరికి కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది. అమెరికాలో ఉద్యోగం చేయడానికి వీలు కల్పించే హెచ్-1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్-1 బీ వీసాదారులు కెనడాలో ఉద్యోగం చేయడానికి ఓపెన్ వర్క్ పర్మిట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఈ విధానం ద్వారా ప్రతి ఏడాది 10 వేల మందికి అవకాశం కల్పిస్తామని పేర్కొంది. అమెరికాలోని కంపెనీల్లో వివిధ రంగాల్లో చేస్తున్నారు. వీరిలో చాలామందికి హెచ్1 బీ వీసా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆర్థికమాంద్యం ప్రభావంతో పలువులు ఉద్యోగాలు కోల్పోయారు. వారిని ఆకర్శించడానికే కెనడా ప్రభుత్వం ఈ ఓపెన్ వర్క్ పర్మిట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. జులై 16, 2023 నాటికి హెచ్ 1 బీ వీసా కలిగి ఉన్న విదేశీయులు, వారితో ఉన్న వారి కుటుంబ సభ్యులు కెనడాకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రకటించింది. వీరికి కెనడాలో మూడేళ్ల పాటు ఉద్యోగం చేయడానికి వర్క్ పర్మిట్ లభిస్తుంది. అలాగే, వీరి జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడిన వారు ఉద్యోగం చేయడానికి కానీ, చదువుకోవడానికి కానీ ఎలాంటి ఆంక్షలు ఉండవు. వారికి వర్క్ వీసా లేదా స్టడీ వీసా మంజూరు చేస్తారు. అంతేకాదు కెనడాలో తాత్కాలిక రెసిడెంట్ వీసా కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాలో హెచ్ 1 బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న, ఉద్యోగాలు పోగొట్టుకున్న భారతీయులకు ప్రయోజనం కలుగనుంది. అమెరికా మీడియా నివేదికల ప్రకారం.. గతేడాది నవంబర్ నుండి ఇప్పటివరకూ దాదాపు 2,00,000 మంది ఐటీ ఉద్యోగులు తొలగించబడినట్లు తెలుస్తోంది.వీరిలో 30 నుంచి 40 శాతం మంది భారతీయులు ఉండొచ్చని అంచనా. వీరందరికి కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది.

No comments:
Post a Comment