ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (GGH Kakinada) అధికారులు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (AP Jobs Notification) విడుదల చేశారు. స్టాఫ్ నర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేసన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 స్టాఫ్ నర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో తమ దరఖాస్తులను (Job Application) సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు.
ఉద్యోగ ఖాళీలు 97
- స్టాఫ్ నర్స్(జీఎన్ఎం) 43
- స్టాఫ్ నర్స్ (బీఎస్సీ నర్సింగ్) 23
- స్టాఫ్ నర్స్ (ఎంఎస్సీ నర్సింగ్) 26
దరఖాస్తు రుసుము
- ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.400, EWS/ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థఉలకు రూ.200 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు.
విద్యార్హత
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్)/ఎంఎస్సీ (నర్సింగ్) విద్యార్హతను కలిగి ఉండాలి
వయోపరిమితి
- అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తులు సమర్పించే చిరునామా
- Office of the Superintendent, Govt. General Hospital, Kakinada District, Kakinada చిరునామాలో జూన్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు నేరుగా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన లింక్స్
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment