తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల(KGBV)ల్లో భారీగా నియామకాలను చేపట్టనుంది. మొత్తం 1,241 మంది మహిళా కాంట్రాక్టు అధ్యాపకులను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్ర వారం నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 475 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల ఉన్నాయి. ప్రతీ సంవత్సరం కొన్నిచోట్ల ఇంటర్ విద్యాను కూడా ప్రవేశ పెడుతున్నారు. ఇంకా ప్రస్తుతం పని చేస్తున్న అధ్యాపకులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై వెళ్తుండడంతో ఖాళీలు ఏర్పడుతున్నాయి. దీంతో ఆ ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని కేజీబీవీల్లో గతంలో 2018 లో కేజీబీవీల్లో పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం అప్పటి నుంచి ఏర్పడిన ఖాళీలకు గెస్ట్ లెక్చరర్లనే తీసుకుంటున్నారు. ఈ ఏడాది కాంట్రాక్ట్ విధానంలో నియామకాలను చేపట్టారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 26వ తేదీన ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జులై 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జులైలోనే ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించున్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు www.schooledu.telangana.gov.in వెబ్ సైట్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ఉద్యోగ ఖాళీలు 1241
- స్పెషల్ ఆఫీసర్ 42
- పీజీ సీఆర్టీలు 849
- సీఆర్టీలు 273
- పీఈటీ 77
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment