ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. చెన్నైలోని ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 782 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. చెన్నైలోని ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 782 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎవరు అర్హులు, దరఖాస్తులకు చివరి తేదీలాంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్‌టీ రేడియాలజీ, ఎంఎల్ పాథాలజీ, కార్పెంటర్, పీఏఎస్‌ఏఏ విభాగాల్లో ఈ అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అంతే కాకుండా.. సంబంధిత స్పెషలైజేషన్ లో ఇంటర్, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు అకడమిక్ లో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు అప్రెంటిస్ ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 30 చివరి తేదీగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. దీని కోసం https://icf.indianrailways.gov.in/ ఈ లింక్ ను ఉపయోగించండి.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment