Mother Tongue

Read it Mother Tongue

Friday, 2 June 2023

తెలంగాణలో ఎల్లుండి భారీ జాబ్ మేళా.. 90కి పైగా కంపెనీల్లో 5 వేలకు పైగా జాబ్స్.. వివరాలివే

తెలంగాణలో మరో భారీ జాబ్ మేళాకు (Job Mela) ఏర్పాట్లు సాగుతున్నాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో 90కి పైగా కంపెనీలు పాల్గొనున్నాయి. తద్వారా 5 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలను (Jobs) కల్పించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహ ర్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీన పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ రోడ్డు లోని ట్రినిటి విద్యా సంస్థల ఆవరణలో నిర్వహించే మెగా జాబ్‌ మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరై సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకే నిరుద్యోగులు పెద్దపల్లికి వచ్చి తమ పేరును రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. ఉదయం నుంచే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఎంపికైన వారికి సాయంత్రమే నియామకపు పత్రాలు అందించనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు ఈ మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగావకాశాలను పొందాలని ఆయన సూచించారు. విద్యార్హతలు: టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీఈ, బీఎస్సీ, ఎంటెక్, డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్, హోటల్ మేనేజ్మెంట్, పీజీ, ఐటీఐ, డ్రైవర్ తదితర అర్హత కలిగిన వారంతా ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చు. ఫ్రెషర్స్/అనుభవం ఉన్న వారు ఎవరైనా ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చు.

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/04/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

No comments:

Post a Comment

Job Alerts and Study Materials