తెలంగాణలో జూన్ 11న నిర్వహించాల్సి ఉన్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు టీఎస్పీఎస్సీ పకబ్భందీగా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో పాటు హాల్ టికెట్స్ విడుదలపై కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ట్మాతకంగా చేపట్టిన గ్రూప్-1 నియామకాలకు సంబంధించి జూన్ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 3.8 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షను అక్టోబర్ 16న నిర్వహించగా.. 2.85 లక్షల మంది హాజరయ్యారు. అయితే.. ఆ పరీక్ష పేపర్ లీకైనట్లు తేలడంతో ఆ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. అనంతరం జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్లు ప్రకటించింది టీఎస్పీఎస్సీ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తోంది. అయితే.. జూన్ 11న నిర్వహించాల్సి ఉన్న గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అయింది. పరీక్ష మళ్లీ వాయిదా పడుతుందేమోనన్న ఆందోళన వారిలో కనిపించింది. అయితే.. పరీక్షను వాయిదా వేయడానికి కోర్టు నో చెప్పడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. టీఎస్పీఎస్సీ సైతం పరీక్షను పకడ్భందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తోంది. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్ల ఎంపికను పూర్తి చేసింది. తాాజాగా పరీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ ను రేపటి నుంచి అంటే.. జూన్ 4వ తేదీ నుంచి వెట్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తాజాగా వెబ్ నోట్ విడుదల చేసింది. పేపర్ లీకేజీ వ్యవహారంతో అప్రతిష్ట పాలైన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఈ సారి అలాంటి మిస్టేక్స్ మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టింది. పరీక్షల నిర్వహణ కోసం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టును సృష్టించారు. ఈ బాధ్యతలను ఐఏఎస్ అధికారికి అప్పగించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. గ్రూప్-1 రాత పరీక్ష ప్రక్రియను ప్రత్యేక విభాగం పర్యవేక్షణలో నిర్వహించనున్నారు.

No comments:
Post a Comment