యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సంస్కృత విద్యాపీఠం పాఠశాలలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విద్యాపీఠం మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తోంది. మొత్తం మూడు పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిని పూర్తిగా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. సంస్కృత టీచర్లకు రెండు పోస్టులు ఉండగా.. ఒక ఇంగ్లీష్ టీచర్ ను నియమించనున్నారు. పూర్తి వివరాలకు దేవస్థాన వెబ్ సైట్ ను https://yadadritemple.telangana.gov.in/ సందర్శించాలి.
ఉద్యోగ ఖాళీలు 3
- సంస్కృత టీచర్లు - 02.
- ఇంగ్లీష్ టీచర్ - 01
సంస్కృత టీచర్లు - 02.
వీటికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు.. బీఈడీ పూర్తి చేసి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఇంగ్లీష్ టీచర్ - 01
దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు.. బీఈడీ పూర్తి చేసి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు.. విద్యార్హత సర్టిఫికేట్లను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎస్ఎల్ఎన్ఎస్ దేవస్థానం ఆఫీస్, యాదగిరి గుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ 508115 అడ్రస్ కు జూన్ 15 సాయంత్రం 5.30లోపు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 42 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు సమయంలో ఎన్వలప్ పైన ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకుంటున్నారో తెలపాల్సి ఉంటుంది. తర్వాత వీరికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఆ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20వేలు చెల్లిస్తారు.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/04/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment