తెలంగాణ సోషల్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలలో సబ్జెక్టు అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సి ఓ ఈ కళాశాలలు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ నీట్ మరియు ఎంసెట్ అంశాలలో కోచింగ్ ఇవ్వడం కోసం సబ్జెక్టుల వారిగా అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ సోషల్ మరియు ట్రైబల్ గురుకుల పాఠశాలలో మొత్తం కలిపి 13 సబ్జెక్టు అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది.
మ్యాథ్స్ సబ్జెక్టులో 22
ఫిజిక్స్ లో 24
కెమిస్ట్రీలో 21
బోటనీ లో 21
జువాలజీలో 25 సబ్జెక్టు అసోసియేట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సబ్జెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ తో పాటు బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.అనుభవం తప్పనిసరి.ఒక అభ్యర్థి ఒక సబ్జెక్టు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. సబ్జెక్ట్ అసోసియేట్ సెలక్షన్స్ 150 మార్కులకు ఉంటుంది.వంద మార్కులు పరీక్ష 50 మార్కులు డెమో అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటాయి. 06/06/2023 రోజున నోటిఫికేషన్ జారీ చేశారు.దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈనెల 15వ తారీకు వరకు అవకాశం ఉంది.ఈనెల 25వ తారీఖున పరీక్ష ఉంటుంది అనంతరం 30వ తారీకు డెమో అండ్ ఇంటర్వ్యూను నిర్వహిస్తారు.అభ్యర్థులు పూర్తి వివరాలకుtgtwgurukulan.com/trwreisసంప్రదించవచ్చు.
గురుకుల విద్యాలయాలలోని ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇలాంటి అవకాశాలు ఎంతగానో ఉపయోగపడతాయి సబ్జెక్టు అసోసియేటెడ్ గా ఎంసెట్ నీట్ జేఈఈ ఉద్యోగులకు ఉచిత శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది.ములుగు జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇలాంటి చిన్నాచితక ఉద్యోగ నోటిఫికేషన్లుఎంతగానో ఉపయోగపడుతుంటాయి.

No comments:
Post a Comment