
తెలంగాణలో ఈ నెల 11న గ్రూప్-1 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీ విడుదల, రిజల్ట్స్, మెయిన్ ఎగ్జామ్స్ డేట్స్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి. ఈ నెల 11న.. ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో.. ఇక కీ విడుదలపై టీఎస్పీఎస్సీ దృష్టి సారించింది. మాస్టర్ క్వశ్చన్ పేపర్, ప్రైమరీ కీని త్వరలోనే విడదుల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లోనే ప్రైమరీ కీ విడుదలయ్యే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ కీని విడుదల చేయనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరో రెండు, మూడు రోజుల్లోనే ప్రైమరీ కీ విడుదలయ్యే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ కీని విడుదల చేయనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఫైనల్ కీ తర్వాత మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ఈ ప్రక్రియలను నెలలోగా పూర్తి చేయాలని కమిషన్ భావిస్తోంది. ఫలితాల తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ కు 3 నెలలు సమయం ఉండేలా షెడ్యూల్ విడుదల చేయనున్నారు. సెప్టెంబరు నెలాఖరు వరకు ఇప్పటికే ప్రకటించిన ఇతర పరీక్షలు ఉన్నాయి. దీంతో.. అక్టోబరు లేదా నవంబరులో గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రూప్-1 ప్రాథమిక పరీక్షకు సుమారు 1.46 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాలేదు. ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 61.37 శాతం హాజరు నమోదైంది. ఈ పరీక్షకు మొత్తం 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను ఇప్పటికే గత ఏడాది అక్టోబర్ 16న నిర్వహించగా.. పేపర్ లీకేజీ కారణంగా రద్దు చేశారు. ఆ పరీక్షకు 2.86 లక్షల మంది హాజరయ్యారు.
No comments:
Post a Comment