Mother Tongue

Read it Mother Tongue

Saturday, 18 March 2023

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 114 ఖాళీలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

 తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసస్ కార్యాలయం, హైదరాబాద్ వారు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 114 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో తమ దరఖాస్తులను (Job Application) సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సూచించిన చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు:

సివిల్ అసిస్టెంట్ సర్జన్ 59 posts

డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 01 Post

ల్యాబ్ టెక్నీషియన్ 11 Posts

ఫార్మసిస్ట్ 43 Posts

Total 114 Posts

విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 44 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు చేయడం ఎలా:

- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ (https://hyderabad.telangana.gov.in/) లేదా పైన అటాచ్ చేసిన పీడీఎఫ్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

- అనంతరం అప్లికేషన్ ఫామ్ లో పేర్కొన్న వివరాలను పూర్తిగా నింపాల్సి ఉంటుంది.

- అప్లికేషన్ ఫామ్ ను పోస్టు లేదా వ్యక్తిగతంగా జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్ , అయిదో అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పటల్, సనత్ నగర్, నాచారం, హైదాబాద్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

- దరఖాస్తులను మార్చి 28వ తేదీ నాటికి చేరేలా పంపించాల్సి ఉంటుంది.


No comments:

Post a Comment

Job Alerts and Study Materials