రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడప్(SEEDAP), డి.ఆర్.డి.ఎ. సంయుక్తంగా సెప్టెంబర్ నెల 27వ తేదిన శుక్రవారం స్థానిక పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. గుణశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందులో క్రెడిట్ ఆక్సిస్ గ్రామీణ్ ఎల్‌టిడి, టివిఎస్ ఇండియన్, బ్యాంక్ జోన్, అపోలో ఫార్మసీ వారు జాబ్ మేళాలో పాల్గొంటున్నారు.
కనీస విద్యార్హత పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ ఫెయిల్/పాస్ అయిన 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు హాజరు కావచ్చునని తెలిపారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలు కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు రసూల్ (6300954441), ధనంజేయులు (7993502145) ను సంప్రదించాలని కోరారు.
క్రెడిట్ ఆక్సిస్ గ్రామీణ్ ఎల్ టి డి సంస్థలో ఎంపికైన వారికి రోజు ఫీల్డ్ వర్క్, కలెక్షన్స్ ఉంటాయి. సంవత్సర ప్యాకేజ్ రూ.2 లక్షల 16 వేలు ఉంటుంది. వయసు 30 కలిగి ఉండాలి. 25 జాబ్స్ ఖాళీ ఉన్నట్టు తెలిపారు. ఇక టి వి ఎస్ ఇండియన్ సంస్థలో ఉద్యోగాలకు ట్రైనింగ్, డిప్లొమా చేసి ఉండాలి. ఖాళీలు 50 ఉన్నాయి. సంవత్సర ప్యాకేజ్ రూ.లక్ష 98 వేలు ఉన్నది. వయసు తప్పనిసరి 18 పైన 25 లోపు ఉండాలన్నారు.
బ్యాంక్ జోన్ సంస్థలో అర్హతలు చూస్తే ఖాతాదారులతో మాట్లాడటం తెలిసుండాలి. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఉండాలి. సంవత్సరపు ప్యాకేజ్ రూ.15000 నుండి రూ.18000 వరకు ఉంటుందన్నారు. ఖాళీలు 50 ఉన్నట్టు సమాచారం. వయసు కచ్చితంగా 18 పైన 30 లోపు ఉండాలన్నారు.
అపోలో ఫార్మసీలో ఉద్యోగాలకు ఎంపికైనవారికి ఫార్మసీ ట్రైనింగ్ ఇవ్వబడును. జాబ్ వస్తే చిత్తూరులో పని చేయాల్సి ఉంటుంది. 10 వ తరగతి పాస్ కావడంతో పాటు ఫార్మసీ కోర్స్ చేసి ఉండాలి. రూ.2,24,000 సంవత్సర ప్యాకేజ్ ఉంటుంది. ఖాళీలు 50 ఉన్నాయి. వయసు 19 పైన 30 లోపు ఉండాలన్నారు.
ok
ReplyDeleteYAzAD
ReplyDelete