తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర షురూ అయింది. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ప్రకటించిన రేవంత్ సర్కార్.. టీజీపీఎస్సీ ప్రక్షాళన మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు ఎగ్జామ్స్ నిర్వహించిన ప్రభుత్వం, తాజాగా వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (Hostel Welfare Officer) రాత పరీక్షల ఫలితాలను విడుదల చేసింది.
తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (Hostel Welfare Officer), లేడీ సూపరింటెండెంట్ (Lady superintendent), వార్డెన్(Warden) తదితర పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష ఫలితాలను TGPSC విడుదల చేసింది. ఫైనల్ కీ (Final Key)తో పాటు జనరల్ ర్యాకింగ్ లిస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలు రాసిన అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి జీఆర్ఎల్ చూసుకోవచ్చు.
నిజానికి ఈ ఉద్యోగాలకు 2022లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కానీ ఇందుకు సంబంధించిన రాత పరీక్షలు 2024 జూన్ 24 నుండి 29 వరకు నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజాగా 81,931 మందితో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు, 497 మందితో కూడిన వార్డెన్ అండ్ మ్యాట్రన్ పోస్టులకు గాను జనరల్ ర్యాంకింగ్ జాబితా ప్రకటించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన మెగా DSC ఫలితాల కోసం అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫైనల్ కీ రిలీజ్ చేసిన విద్యాశాఖ, ఈ నెలాఖరు లోగా GRL విడుదల చేసే ఆలోచనలో ఉందట.
No comments:
Post a Comment