అనంతపురం జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. మొత్తం 84 అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అనంతపురంలో 8, శింగనమలలో 6, నార్పలలో 9, అనంతపురం రూరల్లో 10, తాడిపత్రిలో 14, గుత్తిలో 5, ఉరవకొండలో 12, కళ్యాణదుర్గంలో 6, కణేకల్లులో 5, కంబదూరులో 7, రాయదుర్గంలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులకు సంబంధించి రోస్టర్ పాయింట్లు, ఖాళీల జాబితాను ఆయా సీడీపీఓ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు అక్టోబర్ 1వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలి.
కాగా, అనంతపురం అర్బన్ పరిధిలోని ఎర్రనేల కొట్టాల-2 అంగన్వాడీ వర్కర్ పోస్టు (ఓసీ), నెహ్రూ పూర్మెన్ కాలనీ-3(ఓసీ), అరుణోదయకాలనీ(ఎస్సీ), జనశక్తి నగర్-2(ఓసీ), గుల్జార్పేట (బీసీ-ఏ), ప్రకాష్తోరోడ్డు(ఓసీ), కృపానందనగర్-1(వీహెచ్), వినాయకనగర్-1(ఎస్సీ) అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు సీడీపీఓ లలితమ్మ తెలిపారు.
ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు అక్టోబర్ 1లోపు సీడీపీఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
No comments:
Post a Comment