శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం దన్నానపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6, శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగి 18- 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గల యువతీ యువకులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి అధికారి పి.బి.సాయిశ్రీనివాస్ తెలిపారు.
ఆమదాలవలస దన్నపేట గ్రామంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ శ్రీకాకుళం జిల్లా వారు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో 750 ఉద్యోగాలు ఉన్నాయి అని నైపుణ్యాభివృద్ధి అధికారి పి.బి.సాయిశ్రీనివాస్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఐదు కంపెనీలు పాల్గొంటున్నాయి. అవి హెటిరో కంపెనీలో 55 ఖాళీలు ఉన్నాయి. జాబ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉంటుంది. అర్హతలు డిగ్రీ కెమిస్ట్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, డిప్లొమా ఇన్ మెకానికల్, ఐటిఐ ఫిట్టర్, ఎలక్ట్రికల్, డీజల్ మెకానిక్ ఉండాలి.
నవత ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగ ఖాళీలు 55 ఉన్నాయి. జాబ్ లొకేషన్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి. ఏనీ డిగ్రీ టెన్త్ పాస్ ఫెయిల్ హెవీ లైసెన్స్ ఐటిఐ డిప్లమా ఉన్నవారు అర్హులు. ఏజ్ 19 నుండి 45 సంవత్సరాల వారు అర్హులు. పేటీఎం కంపెనీ మొత్తం ఉద్యోగాలు 45 జాబ్ లొకేషన్స్ శ్రీకాకుళం, విశాఖపట్నం. జాబ్ రోల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఉద్యోగానికి అర్హతలు 10వ క్లాస్ అంతకంటే ఎక్కువ ఐటిఐ డిప్లమా లేదా ఏనీ డిగ్రీ ఉన్నవారు. ఏజ్ 19 నుండి 35 సంవత్సరాల వారు అర్హులు. సెనర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీలో 25 ఉద్యోగాలు ఉన్నాయి. జాబ్ లొకేషన్ దువ్వాడ విశాఖపట్నం. క్వాలిఫికేషన్ ఐటిఐ డిప్లమా లేదా ఏనీ డిగ్రీ ఎన్ని డిగ్రీ ఉన్న వారు అర్హులు. ఏజ్ 19 నుండి 35 సంవత్సరాల అర్హులు.
అమెజాన్ కంపెనీలో 600కు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. జాబ్ లొకేషన్ చెన్నై. జాబ్ రూల్స్ ప్యాకింగ్ పికింగ్ షాపింగ్ లోడింగ్ అన్లోడింగ్. క్వాలిఫికేషన్ టెన్త్ పాస్ లేదా ఇంటర్మీడియట్ లేదా ఏనీ డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుండి 35 సంవత్సరాలు వరకు ఎలిజిబుల్ ఉందన్నారు. ఈ జాబ్ మేళాకు వచ్చే విద్యార్థులందరూ తప్పకుండా బయోడేటా, ఆధార్ కార్డు, టెన్త్ మరియు డిగ్రీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ కోసం అప్లై చేసుకున్నవారు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్ట్ ఫోటోలు తీసుకొని హాజరవ్వాల్సిందిగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి నైపుణ్యాభివృద్ధి అధికారి పి.బి.సాయిశ్రీనివాస్ తెలిపారు.
No comments:
Post a Comment