విద్య , నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రేవంత్ రెడ్డి హైలైట్ చేశారు. విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా, శిక్షణను మెరుగుపరచడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో హెచ్‌సిఎల్ సహకరిస్తుందని ఆయన ఆశాభావం
దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో కొత్త క్యాంపస్‌ను స్థాపించాలని యోచిస్తోంది. దీని ద్వారా 5,000 అదనపు ఇంజనీరింగ్ ఉద్యోగాలు లభించనున్నాయి. సెప్టెంబర్ 27 శుక్రవారం నాడు హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్ రోష్ణి నాడార్ మల్హోత్రా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ పరిణామంపై చర్చించారు.
విద్య , నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రేవంత్ రెడ్డి హైలైట్ చేశారు. విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా, శిక్షణను మెరుగుపరచడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో హెచ్‌సిఎల్ సహకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరిగేలా.. స్థానిక యువతకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల్లో హెచ్‌సీఎల్‌తో భాగస్వామ్యం కావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఉద్ఘాటించారు.
రాష్ట్రంలో ఉద్యోగావకాశాల కల్పనలో హెచ్‌సీఎల్ చేస్తున్న కార్యక్రమాలకు రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. కంపెనీకి మద్దతు ఇవ్వడానికి, సహకరించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. హెచ్‌సిఎల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని గణనీయంగా పెంచుతుందని తెలిపారు.
యువకులకు సాధికారత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లలో భాగస్వామి కావడానికి హెచ్‌సీఎల్ ఆసక్తిగా ఉందని రోష్ని నాడార్ మల్హోత్రా తెలిపారు. హెచ్‌సీఎల్ జియువిఐ ఉద్యోగావకాశాలను కల్పిస్తూనే సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తుందని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో యువతకు అవసరమైన పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలు లభిస్తాయని, తద్వారా భవిష్యత్ సాంకేతిక నిపుణులు, నైపుణ్యం కలిగిన నిపుణులను పొందొచ్చని వివరించారు.
No comments:
Post a Comment