పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతూ ప్రభుత్వం ఉద్యోగమే లక్ష్యంగా చదువుతున్న వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. భారతీయ రైల్వేలలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ద్వారా మొత్తం 11558 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఈ మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 8113 ఉండగా.. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 3445 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం సెప్టెంబర్ 14న దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. 13 అక్టోబర్ 2024 వరకు కొనసాగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ 21 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ 2024 వరకు ఉంటుంది. ఈ తేదీల ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్/12వ తరగతి ఉత్తీర్ణత అర్హత ఉండాలి. గ్రాడ్యుయేట్ పోస్టుల్లో చూస్తే.. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో చూస్తే.. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది.
ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష స్టెప్ 1 -CBT 1 ఉంటుంది. ఆ తర్వాత ఆన్లైన్ పరీక్ష స్టెప్ 2 - CBT 2 నిర్వహించి.. ఆపై షార్ట్ లిస్ట్ అయిన వారికి టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) / ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు.
Geetika priya
ReplyDelete8639476477
ReplyDeleteLove you
ReplyDelete