బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి అలర్ట్. మరో ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank)లో భారీగా అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 550 ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఇందులో యూఆర్- 284, ఎస్సీ- 78, ఎస్టీ- 26, ఓబీసీ- 118, ఈడబ్ల్యూఎస్- 44 జాబ్స్ రిజర్వ్ చేయబడ్డాయి. మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22, తెలంగాణ రాష్ట్రంలో 29 ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు అప్లై చేసేవారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. 01.08.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించాలి. అప్లై చేసిన అభ్యర్థులకు మొదట ఆన్‌లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్) నిర్వహించి ఆపై లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్‌గా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో మెట్రో ప్రాంతంలో అయితే రూ.15,000 స్టైపెండ్, అదేవిధంగా అర్బన్ ప్రాంతంలో అయితే రూ.12,000, సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతంలో అయితే రూ.10,000 స్టైపెండ్ ఇస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ఐఓబీ.. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ.600. దివ్యాంగులకు రూ.400 ఫీజు నిర్ణయించింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 10. మరిన్ని వివరాలకు https://www.iob.in/Careers వెబ్‌సైట్ విజిట్ చేయండి.
No comments:
Post a Comment