అప్రెంటిస్ పోస్టుల కోసం కెనరా బ్యాంక్, గ్రాడ్యుయేట్ల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ canarabank.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు బ్యాంకులో అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు nats.education.gov.inలో అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో 100 శాతం పూర్తి ప్రొఫైల్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
సెప్టెంబర్ 21 నుంచి రిజిస్ట్రేషన్స్ మొదలు కానున్నాయి. దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 4 చివరి తేదీ. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద, సంస్థలో మొత్తం 3,000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.
వయోపరిమితి: ఈ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ కోసం 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే దరఖాస్తుదారులు సెప్టెంబర్ 1, 1996 మరియు సెప్టెంబర్ 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హత: అర్హత సాధించడానికి, అభ్యర్థులు భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) కలిగి ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడిన ఏదైనా సమానమైన అర్హతను కలిగి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు SC, ST, మరియు PwBD కేటగిరీ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది. దరఖాస్తుదారులు క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు (RuPay/Visa/MasterCard/Maestro), ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యాష్ కార్డ్‌లు, IMPS లేదా మొబైల్ వాలెట్‌లను ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు.
అభ్యర్థుల మెరిట్ జాబితాలు 12వ తరగతి (HSC/10+2)/డిప్లొమా పరీక్షలో పొందిన మార్కులు/శాతం ఆధారంగా అవరోహణ క్రమంలో రాష్ట్రాల వారీగా తయారు చేయబడతాయి. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో దరఖాస్తుదారులు సమర్పించిన సమాచారం ఆధారంగా జాబితాలు తయారు చేయబడతాయి. దీని తరువాత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో డాక్యుమెంట్ సేకరణ మరియు స్థానిక భాష యొక్క పరీక్ష జరుగుతుంది.
ఎంపికైన తర్వాత, అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్ వ్యవధిలో నెలవారీ రూ. 15,000 (సబ్సిడీ మొత్తం, ఏదైనా ఉంటే, భారత ప్రభుత్వం ద్వారా) ఆశించవచ్చు. బ్యాంకు ద్వారా ప్రతి నెలా రూ.10,500 అప్రెంటిస్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. 4,500 స్టైఫండ్‌లో ప్రభుత్వ వాటా నేరుగా డిబిటి మోడ్ ద్వారా అప్రెంటిస్‌ల బ్యాంక్ ఖాతాకు జమ చేయబడుతుంది.
No comments:
Post a Comment