తెలంగాణ (Telangana) డీఎస్సీ2024 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేది వరకు నిర్వహించిన డీఎస్సీ(DSC) పరీక్షలకు సంబంధించిన ఫలితాలను నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విడుదల చేశారు.
11062 ఉపాధ్యాయ పోస్టులకు గాను పరీక్షలకు మొత్తం 2,45లక్షల మంది హాజరయ్యారు. ఈ రిజల్ట్స్ కోసం https://tgdsc.aptonline.in/tgdsc/ లింక్ క్లిక్ చేయండి.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించి కేవలం 56 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామని, ఇందుకు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు అని అన్నారు. ప్రస్తుతం 1:3లో ఫలితాలు విడుదల చేశామని, ఈ లిస్ట్ ప్రకారం ఎంపికైన వారందరికీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి అక్టోబర్ 9న అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇస్తామని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మెగా డీఎస్సీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి స్వీకారం చుట్టింది. ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు.. 182 పీఈటీలు.. 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్‌జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాజాగా ఈ ఫలితాలు విడుదలయ్యాయి.
No comments:
Post a Comment