తెలంగాణలో మరోసారి ఉద్యోగాల జాతర మొదలైంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారమే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు.
తెలంగాణలో మరోసారి ఉద్యోగాల జాతర మొదలైంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారమే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు.
ఈ నెలలో 4,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. ఈ నాలుగు వేల ఉద్యోగాల అన్నీ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులే.
క్యాలెండర్ ప్రకారం చూస్తే.. సెప్టెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసి.. నవంబర్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
భర్తీ చేయబోయే పోస్టుల్లో ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ , ఫార్మసిస్ట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. దీనిలో 2030 స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో కొత్తగా 4 ప్రభుత్వ వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. యాదాద్రి-భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర వైద్య, విద్య డైరెక్టరేట్(డీఎంఈ)కి ఎన్‌ఎంసీ సమాచారం పంపింది.
దీని ద్వారా తెలంగాణలో మరో 200 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు 34కు పెరగ్గా వీటిలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4,315కు చేరింది.
No comments:
Post a Comment