Mother Tongue

Read it Mother Tongue

Thursday, 12 September 2024

Telangana Jobs: నిన్న 4 వేల ఉద్యోగాలకు లైన్ క్లియర్.. నేడు మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..


 తెలంగాణలో ఉద్యోగాల జాతర నడుస్తోంది. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. వాటికి అనుగుణంగా నోటిఫికేషన్స్ ను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నెలలోనే 4 వేలకు పైగా వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఇప్పటికే 35 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిన రేవంత్ సర్కార్.. ఈ ఏడాది చివరి నాటికి మరో 35 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుందని.. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా.. న్యాయ సమస్యలు లేకుండా.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేస్తూనే.. మరో వైపు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలను కల్పిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. జిల్లాల వారీగా ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, కాలేజీల్లో ఖాళీ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను కూడా విడుదల చేస్తున్నారు.

తాజాగా మరో ఉద్యోగ ప్రకటన వెలువడింది. TGSRTC తార్నాక నర్సింగ్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రతిపాదికన పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు TGSRTC MD సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను నింపనున్నారు.

ఈ పోస్టుల భర్తీకి ఈ నెల 18న ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు ఉంటాయి. అర్హత గల ఉద్యోగార్థులు పూర్తి వివరాలకు 70750 09463, 88850 27780 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు అని సజ్జనార్ పేర్కొన్నారు.

అర్హతల విషయానికి వస్తే.. ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు నర్సింగ్ లో ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. సంబంధిత పనిలో 12 ఏళ్ల అనుభవం ఉండాలన్నారు. ఈ పోస్టులకు నర్సింగ్ పీహెచ్డీ పూర్తి చేసిన వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

నెలకు జీతం రూ.50 వేలు ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసేవారు కూడా ఎమ్మెస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలన్నారు.

జీతం నెలకు రూ.28 వేలు చెల్లించనున్నారు. ట్యూటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారు నర్సింగ్ లో ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ లేదా పీబీబీఎస్సీ నర్సింగ్ లో ఒక సంవత్సరం అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.25 వేలు చెల్లించనున్నారు.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

SSC Constable GD

Apply Online

(14/10/2024 Last Date)

RRB NTPC Graduate

Apply Online

(13/10/2024 Last Date)

RRB NTPC Under Graduate

Apply Online

(20/10/2024 Last Date)

CISF Constable

Apply Online

(30/09/2024 Last Date)

RRB Para Medical

Apply Online

(16/09/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC JE

Get Notice

(06-11-2024 Exam Date)

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

SSC Stenographer

Get Notice

(10/12/2024 & 11/12/2024 Exam Date)

TGPSC Group II

Get Notice

(15-12-2024 to 16-12-2024 Exam Date)

ఎక్సమ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్:

LIC HFL

Download Hall Ticket

(09/2024 Exam Date)

SSC CGL

Download Hall Ticket

(09/09/2024 to 26/09/2024 Exam Date)

పరీక్ష ఫలితాలు:

India Post GDS Merit List I

Get Exam Result

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

No comments:

Post a Comment

Job Alerts and Study Materials