Mother Tongue

Read it Mother Tongue

Monday, 9 September 2024

చదివి ఖాళీగా ఇంట్లో ఉన్న వారికి జాబ్స్.. హైదరాబాద్‌లో గోల్డెన్ ఛాన్స్!

 పది చదివారా.. లేదంటే ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఖాళీగా ఉన్నారా.. అయితే మీకు అద్భుతమైన అవకాశం అందుబాటులో ఉంది. జాబ్ కొట్టే సువర్ణావకాశం లభిస్తోంది. ఇంతకీ ఎలా జాబ్ పొందొచ్చు.. అనే అంశాన్ని ఒకసారి తెలుసుకుందాం.

చదువుకున్న యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పించే దిశగా జీహెచ్‌ఎంసీ అదిరే ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోంది. గ్రేటర్‌లోని సర్కిళ్ల పరిధిలో లైట్‌ హౌస్‌ కమ్యూనిటీస్‌ ఫౌండేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

వచ్చే రెండు నెలల కాలంలో నాలుగు చోట్ల నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నెలకొల్పే లక్ష్యంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరీముఖ్యంగా మురికివాడలే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు.

పది, ఇంటర్, డిగ్రీ చదివి ఖాళీగా ఉన్న యువతకు ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. నైపుణ్య శిక్షణ ఇస్తుంది జీహెచ్‌ఎంసీ. పలు కార్పొరేట్‌ సంస్థల సీఎస్‌ఆర్‌ నిధులతో శిక్షణ కేంద్రాలు పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఈ క్రమంలో చందానగర్‌ లైట్‌హౌస్‌ సెంటర్‌ సీఈఓ అమృత, ప్రొగ్రాం మేనేజర్‌ ఆకుల శ్రీనివాస్‌తో ఇటీవల జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి సమావేశమయ్యారు. శిక్షణ కేంద్రం నిర్వహణ తీరు, అందుతున్న ఆర్థిక సహాయంపై చర్చించారు.

కాగా శిక్షణ 40 రోజులు ఉంటుంది. రోజూ 4 గంటలు ట్రైనింగ్ ఉండొచ్చు. ఇందులో వ్యక్తిత్వ వికాసం, సాంకేతిక అక్షరాస్యత, స్పోకెన్‌ ఇంగ్లీషు వంటి వాటిపై శిక్షణ ఉంటుంది.

ఇక కోర్సు పూర్తి చేసిన వారి ఆసక్తి మేరకు ఫ్యాషన్‌ డిజైనింగ్, ఆటోమొబైల్, కంప్యూటర్, ఐటీ, హెల్త్‌కేర్, మార్కెటింగ్‌ రంగాల్లో అవకాశాలపై కౌన్సిలింగ్‌ ఇస్తారు. ఆ తర్వాత అమెజాన్, ఇండియా ఈగల్, ఐసీఐసీఐ, ఐడీబీఐ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి.



17 comments:

Job Alerts and Study Materials